Friday, November 22, 2024

క్రూడ్‌ మంట తగ్గినా.. దిగిరాని పెట్రో ధరలు

అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు ఆరు నెలల కనిష్టానికి దిగొచ్చాయి. బ్యారల్‌ ధర 130 డాలర్లకు చేరినప్పుడు సామాన్యుడిపై భారాన్ని మోపిన చమురు సంస్థలు, ఇప్పుడు ధరలను తగ్గించడం లేదు. అదేమంటే డీజిల్‌ ధరల్లో తాము నష్టాలను భరిస్తూ వచ్చామని దేశీయ చమురు సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముడిచమురు బ్యారల్‌ ధర 91-95 డాలర్ల మధ్య కొనసాగుతోంది. పెట్రోలియం అవసరాల్లో 85శాతం దిగుమతులపై ఆధారపడిన మన దేశానికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

ప్రభుత్వ ఆధీనంలోని ఇంధన రిటైలర్లు ఐవోసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ నాలుగున్నర నెలలుగా అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజెల్‌ రిటైల్‌ అమ్మకపు ధర సర్దుబాటు విధానం కొనసాగించడం లేదు. ఒక దశలో వారు డీజిల్‌పై లీటరుకు రూ. 20-25, పెట్రోల్‌పై రూ.14-18 నష్టాన్ని భరించారు. ప్రస్తుతం పెట్రోల్‌పై ఎలాంటి అండర్‌ రికవరీ (నష్టాలు) లేవు. డీజిల్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి కొంత సమయం పడుతుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. డీజిల్‌ అండర్‌ రికవరీ ఇప్పుడు లీటరుకు రూ.4-5కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement