నడిరోడ్డుపై ఓ యువకుడితో గొడవపడ్డాడు హీరో నాగశౌర్య.కాగా నాగశౌర్య వెళ్తున్న దారిలో ఓ అబ్బాయి మరో అమ్మాయిని రోడ్డు మీద కొడుతున్నాడని, కారు ఆపి ఆమెకు సారీ చెప్పాలని ఆ యువకుడితో గొడవకు దిగాడు. ఆ అమ్మాయి తన గర్ల్‌ఫ్రెండ్ అని చెప్తుండగా.. గర్లఫ్రెండ్ అయితే కొడతావా అంటూ ఆ అమ్మాయికి సారీ చెప్పాలని గొడవపడుతున్నాడు. ఆ అబ్బాయి వెళ్లిపోతుంటే చేయిని లాగి మరీ సారి చెప్పమంటూ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటీజన్లు నాగశౌర్యను అభినందిస్తున్నారు. ఒక అమ్మాయిని కొడుతున్నారని కారు ఆపి గొడవకు దిగావంటే నువ్వు గ్రేట్ శౌర్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నాగశౌర్యను రియల్ హీరో అని పొగుడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement