Tuesday, November 26, 2024

య‌శోద‌లో ఈవా ఐవీఎఫ్ పేరు మార్పు.. ఓటీటీ రిలీజ్ కి లైన్ క్లియ‌ర్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన య‌శోద చిత్రంపై ఈవా ఐవీఎఫ్ హాస్ప‌ట‌ల్ వారు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. యశోద చిత్రానికి మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందించారు. యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ తెరకెక్కించారు. హీరోయిన్ స‌మంత‌.. ఉన్ని ముకుందన్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. యశోద చిత్రంలో తమ ఆస్పత్రిని నెగెటివ్‌ యాంగిల్‌లో చూపించారని, యశోదను నిలిపేయాలని కోరుతూ ఈవా ఐవీఎఫ్‌ హాస్పిటల్‌ టీం యశోద మేకర్స్ పై హైదరాబాద్‌ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో యశోద ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. డిసెంబర్ 19 వరకు యశోదను ఓటీటీలో విడుదల చేయొద్దని మేకర్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ వ్యవహారంలో మేకర్స్-ఈవా హాస్పిటల్‌ బృందం రాజీకి వచ్చారు. యశోదలో ఈవా పేరు కాన్సెప్ట్‌కు అనుగుణంగానే పెట్టామని, ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసేందుకు మాత్రం కాదని అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌. ఈవా హాస్పిటల్‌ టీంను కలిసి పూర్తి వివరాలు చెప్పాను. భవిష్యత్‌లో ఇకమీదట ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదని, ఇది తెలియక జరిగిన చిన్న పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తమ నిర్ణయానికి ఈవా సంస్థ కూడా అంగీకారం తెలిపిందని, పేరు విషయంలో నెలకొన్న సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఈ విషయంపై ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్‌ రావు మాట్లాడుతూ.. సినిమాలో మా హాస్పిటల్‌ పేరును వినియోగించడంతో హర్ట్‌ అయ్యాం. అయితే ఈ విషయాన్ని నిర్మాత దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యను పరిష్కరించడంతో లైన్‌ క్లియర్‌ అయిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement