న్యూఢిల్లి : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టి బ్రాండ్ ఈవీ ప్లాట్‌ఫామ్ బిలైవ్.. రంగారెడ్డి జిల్లాలోని బాపునగర్‌లో తన మూడో ఈవీ ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌కు వరుసగా ప్రగతినగర్, హఫీజ్‌పేట్‌లో మరో రెండు ఈవీ ఎక్స్పీరియన్స్ స్టోర్లు ఉన్నాయి. భారతదేశంలో 100కు పైగా స్టోర్లను ఏర్పాటు చేయాలనే కంపెనీ ప్రణాళికల్లో భాగంగా.. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో కనీసం 15 మల్టి బ్రాండ్ స్టోర్లను ఏర్పాటు చేయాలని బిలైవ్ యోచిస్తున్నది. సరికొత్త బీలైవ్ ఈవీ ఎక్స్పీరియన్స్ స్టోర్ వ్యక్తిగత మొబిలిటీ, వ్యాపారాల కోసం అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుంది. స్టోర్ ద్వారా.. బీలైవ్ అనేక బ్రాండ్ల ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ డెలివరీ వాహనాలను ప్రదర్శించి.. ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త స్టోర్‌లో ఇన్‌హౌస్ క్విక్ సర్వీస్ కియోస్క్, బ్యాటరీ స్వాప్ సౌకర్యాలు, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ కూడా ఉన్నాయి.
బీలైవ్ సహ వ్యవస్థాపకుడు సమర్థ్ ఖోల్కర్ మాట్లాడుతూ.. నగరంలో మూడో స్టోర్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌కు తమకు ఎంతో ప్రత్యేకమైన నగరమని, తమ మొట్టమొదటి ఈవీ ఎక్స్పీరియన్స్ స్టోర్ ఇక్కడే ప్రారంభించామన్నారు. మల్టి బ్రాండ్ ఈవీ రిటైల్ కాన్సెప్ట్‌ను ప్రారంభించడంతో బీలైవ్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను వేగవంతం చేస్తుందన్నారు. వినియోగదారులు ఎలక్ట్రిక్‌కు మారేందుకు వీలుగా తాము అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. నగరంలో స్టోర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా.. బీలైవ్ క్లీన్ టెక్‌ను కస్టమర్లకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..