Saturday, November 23, 2024

ప్రమాదంలో యూరప్‌, దాడిని ఖండించిన బైడెన్‌, బోరిస్‌, జస్టిన్‌ ట్రూడో

రష్యా దళాల దాడిలో ఉక్రెయిన్‌లోని జప్రోజియా అణు విద్యుత్‌ ప్లాంట్‌ ధంసం అవడంపై ప్రపంచ దేశాల అధినేతలు స్పందించారు. రష్యా దాడితో.. ఒక న్యూక్లియర్‌ ప్లాంట్‌లో మంటల్లో చిక్కుకుపోవడంతో.. రష్యా మొత్తం ఐరోపా ఖండం భద్రతనే ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రష్యా వెంటనే సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కోరారు. అగ్నిమాపక సిబ్బంది, ఇతర అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకునేలా రష్యా అనుమతించాలన్నారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ స్పందిస్తూ.. అణు కేంద్రంపై దాడి గురించి తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో మాట్లాడినట్టు వివరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ లెక్కలేనితనం యూరప్‌ దేశాల భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందన్నారు.

రష్యా తక్షణమే పవర్‌ స్టేషన్‌పై దాడి నిలిపివేయాలని, ఆ రియాక్టర్‌ సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వీలు కల్పించాలన్నారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్పందిస్తూ.. జెలెన్‌ స్కీతో మాట్లాడినట్టు తెలిపారు. ఏమాత్రం ఆమోదయాెెగ్యం కాని ఈ దాడులను రష్యా వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి రేడియేషన్‌ నమోదుకాలేదని యూఎస్‌ ఎనర్జీ సెక్రెటరీ వెల్లడించారు. అలాగే ఎమర్జెన్సీ పరికరాలు ప్రభావితం కాలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే రష్యా తరువాత ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుందోనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement