Sunday, October 6, 2024

Euro Cup | స్లోవేకియాపై ఉక్రేయిన్ విజ‌యం…

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో గ్రూప్-ఇలో ఉన్న‌ స్లోవేకియా, ఉక్రెయిన్ జట్లు తలపడ్డాయి. కాగా, ఈ మ్యాచ్‌లో ఉక్రెయిన్‌ విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్లోవేకియాపై 2-1 తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో దూకుడుగా ప్రారంభించిన స్లోవేకియా 17వ నిమిషంలో తొలి గోల్ చేసి విరామ సమయానికి ఉక్రెయిన్‌పై 1-0 ఆధిక్యంలో నిలిచింది.

అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న‌ ఉక్రెయిన్ 54వ నిమిషంలో గోల్ చేసి స్కోరు సమం చేసింది… 80వ నిమిషంలో మరో గోల్ స్లోవేకియాపై ఆధిక్యాం సాధించింది. ఆ తర్వాత స్లోవేకియా గోల్‌ చేయకపోవడంతో ఉక్రెయిన్‌ 2-1తో విజయం సాధించింది.

ఇక గ్రూప్-ఇలో ఉన్న‌ ఉక్రెయిన్, స్లోవేకియా…. ఒక ఓటమి, ఒక విజయంతో మూడు పాయింట్లతో రెండు, మూడో స్థానాలతో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement