Thursday, September 12, 2024

Euro Cup | టర్కియాపై పోర్చుగల్ విజ‌యం

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్‌లో గ్రూప–ఎప్​ లోని టర్కియా – పోర్చుగల్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కాగా, ఈ మ్యాచ్ లో పోర్చుగల్ విజ‌యం సాధించింది. మోద‌టి నుంచే ఆధిప‌త్యం చెలాయించిన పోర్చుగల్.. టర్కియాని ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. దీంతో టర్కియాపై 3-0 తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన పోర్చుగల్ 21వ నిమిషంలో తొలి గోల్ చేసింది. ఆ తర్వాత 28వ నిమిషంలో మరో గోల్ రావడంతో విరామ సమయానికి స్కోరు 2-0తో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ అదే దూకుడుతో ఆడిన పోర్చుగల్ 55వ నిమిషంలో మరోసారి గోల్ చేసింది. టర్కీపై ఆధిపత్యం చెలాయిస్తూ… ఆ జ‌ట్టుకు గోల్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. దీంతో పోర్చుగల్ 3-0తో విజయం సాధించింది.

గ్రూప్-ఎఫ్‌లో ఉన్న పోర్చుగల్ రెండు వరుస విజయాలతో 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అదే గ్రూప్‌లోని టర్కీయా ఒక విజయం, ఒక ఓటమితో రెండో స్థానంలో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement