యూరోపియన్ ఛాంపియన్షిప్లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్లో గ్రూప ఏలోని జెర్మనీ – హంగేరికి జట్లు తలపడగా.. ఈ మ్యాచ్ లో జెర్మనీ విజయం సాధించింది. మోదటి నుంచే ఆధిపత్యం చెలాయించిన జర్మనీ హంగేరీని ఒక్క గోల్ కూడా చేయనివ్వలేదు. దీంతో హంగేరీపై 2-0 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన జెర్మనీ 22వ నిమిషంలోనే ఒక గోల్ చేసింది. దాంతో విరామ సమయానికి స్కోర్ 1-0తో నిలిచింది. ఇక రెండో అర్ధభాగంలోనూ అదే దూకుడుతో ఆడిన జెర్మనీ.. 67వ నిమిషాంలో మరో గోల్ చేసింది. దీంతో
గ్రూప్-ఏలో ఉన్న జర్మీనీ.. వరుసగా రెండు విజయాలతో పాయింట్స్ టేబుల్ లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదే గ్రూప్ లో ఉన్న హంగేరి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి మూడవ స్థానంలో ఉంది.