Wednesday, November 20, 2024

యూరో కప్ ఫైనల్ లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్..

యూరో కప్ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది ఇంగ్లండ్… డెన్మార్క్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌ 2-1తో చారిత్రక విజయం సాధించింది. యూఈఎఫ్‌ఏ చాంపియన్‌షిప్‌ యూరోకప్‌ 2020లో ఇంగ్లండ్‌ జట్టు 55 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. డెన్మార్క్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 2-1 తేడాతో విజయం సాధించింది. 1966 ప్రపంచకప్‌ తర్వాత ఒక మేజర్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ ఫైనల్లో అడుగుపెట్టడం ఇదే.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ఆట 30వ నిమిషంలో డెన్మార్క్‌ ఆటగాడు మిక్కెల్‌ డ్యామ్స్‌గార్డ్‌ ఫెనాల్టీ కిక్‌ను అద్బుతమైన గోల్‌గా మలిచాడు. దీంతో ఆ జట్టు 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట హోరాహోరీగా సాగుతున్న క్రమంలో డెన్మార్క్‌ ప్లేయర్‌ సైమన్‌ జైర్‌ చేసిన పొరపాటుకు ఆ జట్టు తగిన మూల్యం చెల్లించుకున్నది. మ్యాచ్‌ 90వ నిమిషంలో సైమన్‌.. సెల్ఫ్‌గోల్‌ చేయడంతో ఇంగ్లండ్‌ ఖాతా తెరిచినట్లయింది. దీంతో ఇరు జట్ల స్కోర్‌ సమం అయ్యింది. సమయం ముగిసినప్పటికీ ఫలితం తేలకపోవడంతో నిర్వాహకులు అదనపు సమయం కేటాయించారు. దీంతో 14వ నిమిషం వద్ద ఇంగ్లండ్‌ ఆటగాడు హెర్రీ కేన్‌ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచిన హెర్రీ.. తన జట్టుకు మరపురాని విజయాన్ని సాధించిపెట్టాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 56 ఏండ్ల కళ ఫలించినట్లయింది. మొదటిసారిగా ఓ ప్రముఖ టోర్నీలో ఫైనల్‌లో తలపడనుంది. వచ్చే ఆదివారం వెంబ్లే స్టేడియంలో ఇటలీతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇది కూడా చదవండి: ఇవాళ, రేపు కూడా విస్తారంగా వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement