Friday, September 20, 2024

Euro Cup | డ్రా గా ముగిసిన డెన్మార్క్ – ఇంగ్లాండ్ మ్యాచ్

యూరోపియన్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఈరోజు జరిగిన మరో మ్యాచ్ లో గ్రూప్ సీలోని డెన్మార్క్ – ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో దూకుడుగా ఆడిన ఇరు జట్లు ఒక్కో గోల్ చేసి విరామ స‌మయానికి స్కోర్ 1-1తో డ్రాగా ముగిసింది.

తొలి అర్ధభాగంలో 18 వ నిమిషంలోనే ఇంగ్లాండ్ తొలి గోల్ చేసింది. ఆ త‌రువాత డెన్మార్క్ కూడా స్ట్రైక్ చేసి 1-1 తో స‌మం చేసింది. అయితే, ద్వితీయార్ధంలో ఇరు జ‌ట్లు పోరాడినప్ప‌టికీ గోల్స్ చేయ‌లేక‌పోయాయి. దీంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement