Friday, September 20, 2024

Euro Cup | పోలాండ్ పై ఆస్ట్రియా విజ‌యం…

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో గ్రూప్-డిలో ఉన్న పోలాండ్ – ఆస్ట్రియా జట్లు తలపడ్డాయి. కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రియా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో స్లోవేకియాపై 3-1 తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం నుంచే దూకుడుగా ప్రారంభించిన ఆస్ట్రియా 9వ నిమిషంలోనే తొలి గోల్ చేసింది. ఇక 30వ నిమిషంలో పోలాండ్ కూడా ఒక గోల్ చేసి విరామ సమయానికి 1-1తో స్కోర్ స‌మం చేసింది.

అయితే రెండో అర్ధభాగంలో ఆస్ట్రియా 66, 78వ నిమిషాల్లో వ‌రుస‌గా మ‌రో రెండు గోల్స్ చేసి.. పోలాండ్ పై మ‌రో సారి అధిక్యం సాధించిది. ఇక ఆ త‌రువాత పోలాండ్ గోల్‌ చేయకపోవడంతో 3-1తేడాతో ఆస్ట్రియా విజయం సాధించింది.

ఇక గ్రూప్-డిలో ఉన్న ఆస్ట్రియా ఒక ఓటమి, ఒక విజయంతో మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు పోలాండ్ రెండు మ్యాచ్‌లు ఆడి ఇంకా ఖాతా తెరవలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement