Saturday, November 23, 2024

ఓట్ల కోసమే ‘దళితబంధు’: ఈటల రాజేందర్

హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఓటమి ఖాయం అయిపోయిందన్నారు ఈటెల రాజేందర్. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలపై ప్రేమ తో కాకుండా ఓట్ల కోసమే దళిత బంధు ఇస్తోందని విమర్శించారు. హుజూరాబాద్‌ ప్రజలకు ఇచ్చే వరాలు రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన రాజీనామాతోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్‌కార్డులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చే దళితబంధు, పింఛను, రేషన్‌కార్డులు తీసుకుని ఓటు మాత్రం ఈటలకే వేస్తామని హుజూరాబాద్‌ ప్రజలు అంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోందన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ.వందలకోట్లు ఖర్చు చేసినా.. భారీగా పోలీసులను మోహరించినా టీఆర్ఎస్ ఓటమి నిర్ణయమైపోయిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని విమర్శించారు ఈటల. ఓట్ల కోసమే దళితబంధు పెట్టారని ప్రజలకూ తెలుసన్నారు. తన డిమాండ్ల ఫలితంగానే దళిత అధికారులకు మంచి పోస్టింగులు ఇచ్చారని.. రాజీనామాతో హుజూరాబాద్‌ ప్రజలకు లాభం కలిగిందని ఈటల అన్నారు.

ఇది కూడా చదవండి: తల వెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..

Advertisement

తాజా వార్తలు

Advertisement