అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖ(స్టేట్ టాక్స్)లో కొత్త సర్కిల్స్ ఏర్పాటయ్యాయి. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 110 సర్కిల్స్ ఉండగా వీటిని కొత్త జిల్లాల వారీగా సర్థుబాటు చేసి 109కి కుదించారు. జిల్లాల్లో సర్కిల్స్ పరిధిలను నిర్ణయిస్తూ అధికారుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల వసూళ్లు, ట్రేడర్ల కార్యకలాపాలపై నిఘాను సర్కిల్స్ వారిగా కొనసాగించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకే ఒక సర్కిల్ ఉండగా, ఎన్‌టీఆర్ విజయవాడ జిల్లాలో అత్యధికంగా 14 సర్కిల్స్ ఉన్నాయి. మదన్యం జిల్లాలో పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు సర్కిల్స్ మాత్రమే ఏర్పాటు చేశారు. పాత జిల్లాల్లో కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో అతి తక్కువగా మూడేసి సర్కిల్స్ ఉండగా అత్యధికంగా విశాఖపట్టణం జిల్లాలో పదకొండు ఉన్నాయి.
జిల్లాల వారీగా సర్కిల్స్ విషయానికి వస్తే శ్రీకాకుళంలో నాలుగు, విజయనగరంలో మూడు, అనకాపల్లిలో రెండు, కాకినాడలో ఐదు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్(కోనసీమ)లో నాలుగు, తూర్పు, పశ్చిమ గోదావరిలో నాలుగేసి చొప్పున, ఏలూరు జిల్లాలో మూడు, గుంటూరు జిల్లాలో తొమ్మిది, బాపట్ల జిల్లాలో రెండు, పల్నాడు జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో మూడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో నాలుగు, కర్నూలు జిల్లాలో నాలుగు, నంద్యాల జిల్లాలో రెండు, శ్రీసత్యసాయి జిల్లాలో రెండు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు, అన్నమయ్య జిల్లాలో రెండు, శ్రీ బాలాజీ జిల్లాలో ఆరు సర్కిల్స్‌ను వాణిజ్య పన్నుల శాఖ ఏర్పాటు చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.