ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ నిధులను 15 శాతం వరకు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుడి పెట్టేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత ఆదివారం నాడు జరిగిన ఈఎస్‌ఐ బోర్డు 189వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇది 10 శాతంగా ఉంది. ఈఎస్‌ఐసిలో కార్మికులు, యాజమాన్యాలు జమ చేసే నిధుల నుంచి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ నిర్ణయాన్ని బోర్డులో ఉన్న కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రారంభంలో 5 శాతం నిధులను ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించిన బోర్డు క్రమంగా దాన్ని 10 శాతానికి, ప్రస్తుతం 15 శాతానికి పెంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement