Friday, November 22, 2024

Follow up | ఐసెట్‌, ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈనెల 29 నుండి ఈసెట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ కౌన్సెలింగ్‌, ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈసెట్‌ స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 4 వరకు ఈసెట్‌ అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 8న ఈసెట్‌ అభ్యర్థులకు తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. ఆగస్టు 20 నుంచి ఈసెట్‌ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. ఆగస్టు 26న ఈసెట్‌ అభ్యర్థులకు తుది విడుత సీట్లు- కేటాయించనున్నారు.


ఆగస్టు 14 నుంచి ఐసెట్‌..

- Advertisement -

టీఎస్‌ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది. అదేనెల 14 నుంచి 18వ తేదీ వరకు రిజిస్ట్రేష్రన్లు, స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 16 నుంచి 19వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుoది. 16 నుంచి 21 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25వ తేదీన ఎంబీఏ, ఎంసీఏ తొలి విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి తుది విడుత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అదేనెల 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడుత వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 7న తుది విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్‌ 8న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement