హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఈసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు శుక్రవారం ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జూలై 29 నుంచి రిజిస్ట్రేష్రన్, స్లాట్ బుకింగ్ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేష్రన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
ఇక ధృవపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆగస్టు 8న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. తదనంతరం మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆగస్టు 20 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఆగస్టు 26న తుది విడత సీట్లను కేటాయిస్తారు. ఇక చివరగా.. ఆగస్టు 28న అభ్యర్థులకు స్పాట్ ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు- అధికారులు తెలిపారు.
ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..
జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు: రిజిస్ట్రేష్రన్, స్లాట్ బుకింగ్.
జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు: ధ్రువపత్రాల పరిశీలన.
జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.
ఆగస్టు 8న: తొలి విడత సీట్ల కేటాయింపు.
ఆగస్టు 20: తుది విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.
ఆగస్టు 26: తుది విడత సీట్ల కేటాయింపు.
ఆగస్టు 28న: స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల