సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇలాంటి సూర్యగ్రహణాన్ని కృత్రిమంగా సృష్టించవచ్చా.. సాధ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రెండు శాటిలైట్లను పంపించి సూర్యుడిని కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణం ఏర్పడేలా చేయవచ్చని వీరు చెబుతున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మన ఇస్రోకు చెందిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) ద్వారా రెండు శాటిలైట్స్‌ను ప్రయోగించాని నిర్ణయించింది.
ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఈ శాటిలైట్స్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోబా-3 పేరుతో పిలుస్తున్ను ఈ ప్రయోగం విజయం సాధిస్తే ప్రపంచంలోనే మొదటి మానవ నిర్మిత సూర్యగ్రహణం ఏర్పాటు అవుతుంది. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు ఈ దిశగా తమ ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో విజయం సాధిస్తామని వీరు విశ్వాసంతో ఉన్నారు. ఈఎస్‌ఏ ఇందుకోసం మిషన్ ప్రోబా-3ని చేపట్టింది. సూర్యుడిలో కొంత భాగాన్ని శాటిలైట్స్ ద్వారా కవర్ చేయడం ద్వారా కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తారు.
ఈఎస్‌ఏ రెండు ఉపగ్రహాలను ప్రయోగించడానికి సిద్ధమవుతోంది. అవి ఒకదానితో ఒకటి అమర్చబడి ఉంటాయి. ఇది సూర్యని కరోనాను, నక్షత్రం చుట్టూ ఉన్న బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించారు. ఇది విజయం సాధిస్తే సౌర పరిశోధనలో గణనీయమైన పురోగతిని సాధిస్తుంది. సూర్యుడిని అధ్యయనం చేసే విధానాన్ని మార్చే అవకాశం ఉంది. ఈ మిషన్‌లో కరోనాగ్రాఫ్, ఓకల్టర్ అనే రెండు అంతరిక్ష నౌకలను ఒక ఖచ్చితమైన ఆకృతిలో ప్రయోగిస్తారు.
ఇది ఒకదానికొకటి దగ్గరగా దాదాపు 144 మీటర్ల దూరంలో ఉంచుతారు. ఇందులో ఒకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్తుంది. ఇది సూర్యుడి వలయాన్ని బ్లాక్ చేయడం ద్వారా మరో శాటిలైట్‌పై నీడ పడేలా చేస్తూంది. ఇది సూర్యగ్రహణం సమయంలో చంద్రుడి నీడ ఎలాయితే భూమిని చేరుతుందో అలాగే కనిపించేలా చేస్తుంది. ఈ వ్యూహాత్మక పోజిషన్స్ నేరుగా సూర్యకాంతితో సంబంధంలేకుండా సూర్యుడి కరోనాను పరిశీలించడానికి దోహదం చేస్తాయి.
శాటిలైట్ సూర్యుడి వలయంలోని చిత్రాలను తీసుకున్న తరువాత ఇంజినీర్లు స్టాక్‌ను వేరు చేయమని ఆదేశించారు. ఇది ఢీకోనే ప్రమాదాన్ని నిరోధించి, సురక్షితమైన కక్ష్యలోకి వెళ్లేలా చేస్తుంది. సోలార్ కరోనాను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు భూ అయస్కాంత తుఫానులు వంటి సౌర వాతావరణ సంఘటనలను, ఉపగ్రహ కార్యకలాపాలు, భూ సంబంధమైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లకు ఎలా అంతరాయం కలిగిస్తున్న దానిపై అధ్యయనం చేస్తారు.
ప్రోబా-3 అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి కానుంది. సోలార్ విండ్ డైనమిక్స్‌కు సంబంధించిన అనేక పరిష్కారం కాని ప్రశ్నలకు వీటి ద్వారా పరిష్కరించే సామర్ధ్యాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్ర స్తుతం ఈ రెండు శాటిలైట్స్ బెల్గామ్‌లో తుది పరీక్షలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్‌లో పీఎస్‌ఎల్‌వీ ద్వారా వీటిని ప్రయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు. ప్రోబా-3 ఉపగ్రహాలతో సృష్టించే ఈ కృత్రిమ సూర్యగ్రహణాన్ని భూమి పై నుంచి తిలకించేందుకు కనిపించదు.