Monday, September 16, 2024

Erravalli – తండ్రికి క‌విత పాదాభివంద‌నం.. బిడ్డ‌కు కెసిఆర్ ఆత్మీయ ఆశీర్వ‌చ‌నం

బిడ్డ‌కు కెసిఆర్ ఆత్మీయ ఆశీర్వ‌చ‌నం
ఎర్ర‌వెల్లి ఫామ్ హౌజ్ కు వెళ్లిన క‌విత‌
తండ్రిని చూడ‌గానే బావోద్వేగం…
ప‌ది రోజుల పాటు తండ్రి వ‌ద్దే క‌విత‌
చూసేందుకు ఎవ‌రు రావ‌ద్ద‌ని విన‌తి

ఎర్రవెల్లిలోని బిఆర్ఎస్ అధినేత‌, తండ్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ క‌విత నేడు క‌లిశారు.. భర్త, కుమారుడితో కలిసి వచ్చిన అమెకు దిష్టి తీసి సిబ్బంది స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భోవోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కవిత తండ్రి పాదాలకు నమస్కరించింది. అనంతరం కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. దీంతో చాలాకాలం తర్వాత కేసీఆర్ మొహంలో ఉత్సాహం కపించించింది. ఇక అక్క‌డ అంద‌ర్ని క‌విత పేరుపేరున ప‌ల‌క‌రించింది.. తాను జైలులో ఉన్న‌ప్పుడు అండ‌గా నిలిచిన నేత‌ల‌కు కృతజ్ఞ‌త‌లు తెలిపింది..

- Advertisement -

10 రోజులు తండ్రి వ‌ద్దే..

ఇది ఇలా ఉంటే మరోవైపు పది రోజుల పాటు ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ లోనే విశ్రాంతి తీసుకుంటానని ఈ సందర్భంగా కవిత వెల్లడించారు. ఈ పది రోజులు తనను డిస్టర్బ్ చేయొద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని అభిమానులు, కార్యకర్తలకు కవిత విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో అభిమానులు సహకరించాలని కోరారు. పది రోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. మరికాసేపట్లో కేసీఆర్‌తో కవిత భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement