Friday, November 22, 2024

హర్‌ ఏక మాల్‌ సస్తా.. ఎరగ్రడ్డ సండే బజార్‌ 2 కోట్లకు పైగా వ్యాపారం

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : విభిన్న సంస్కృతులు, ఆచారాలకు నెలవు హైదరాబాద్‌. గోల్కొండ నవాబులు, ఆసఫ్‌ జాహీల నుంచి నేటి వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యం భాగ్యనగరం. వందేళ్ల క్రితం పాత బస్తీలో ప్రారంభమైన జుమ్మేరాత్‌ బజార్‌ స్ఫూర్తితో 1980లో చిన్న అంగడిగా మొదలైన ఎర్రగడ్డ సండే బజార్‌ నేడు హైదరాబాద్‌ నగరంలోనే అతి పెద్ద వార సంతగా వెలుగొందుతోంది. అమీర్‌ పేట నుంచి కూకట్‌పల్లి వెళ్లే దారిలో ఎర్రగడ్డ మెట్రో నుంచి సనత్‌ నగర్‌ వరకు రెండు కిలోమీటర్ల పొడవునా ఈ అంగడి సాగుతుంది. ఈ బజార్‌ను చోర్‌ బజార్‌గా కూడా పిలుస్తారు. ఎర్రగడ్డ సండే బజార్‌లో గుండు పిన్ను నుంచి వాహానాల విడిభాగాల వరకు తక్కువ ధరలకు దొరుకుతాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, సైకిళ్లు, పాత టైర్లు, వాహనాల విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ పరికరా లు, పురాతన నాణేలు, రంగురాళ్లు, బట్టలు, చెప్పులు, గృహోపకరణాలు ఒక్కటేంటి సామాన్యునికి కావాల్సిన అన్నిరకాల పాత, కొత్త వస్తువులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌ అధునిక మార్కెట్లలో లభించని అతి పురాతన వస్తువులు సైతం ఇక్కడ లభిస్తాయి. పేద, మద్యతరగతికి చెందిన ప్రజలు ఈ మార్కెట్‌లో దొరికే వస్తువుల కోసం తమ పనులను సైతం వదులుకొని వస్తారని ప్రతీతి. ఎందు కంటే ఇక్కడ అభించే వస్తు వులు ఎంతో పేరు గాంచిన జుమ్మెరాత్‌ బజార్‌లో సైతం దొరకవని నమ్మకం. వ్యాపారులు సైతం తాము అమ్మే వస్తువుల నాణ్యత, పని తనానికి సంబంధిచి కస్టమర్లకు నిజాయిగా చెబుతారనే పేరుంది. దాంతో అనతి కాలంలోనే ఈ మార్కెట్‌ హైదరాబాద్‌లోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరు గాంచింది.

ఉదయం 7 నుంచి ప్రారంభం..

ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్‌ నడుస్తుంది. ఉద యం 7 ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సాగే ఈ మార్కెట్‌కు హైదరాబాద్‌, సికింద్రాబా ద్‌తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి తమకు కావల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ప్రజలు వస్తారు. ఒకప్పుడు కేవలం ఎర్రగడ్డ మెయిన్‌ రోడ్‌ కే పరిమితమైన ఈ సంత… వ్యాపారులు, కొనుగోలు దారులు అధికం కావడంతో సనత్‌ నగర్‌ బస్టాండ్‌ వరకు రెండు కిలోమీటర్ల పొడవు విస్తరించింది. హైదరాబా ద్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 500 మందికి పైగా వ్యాపారులు కొలువుదీరే ఈ సంతలో రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు సాగుతాయి.

మార్కెట్‌ కంటే తక్కువ ధరలు..

హైదరాబాద్‌ నగరంలో ప్రసిద్ధి గాంచిన చార్మినార్‌, కోఠీ, సుల్తాన్‌ బజార్‌ తదితర మార్కెట్ల కన్నా ఇక్కడ వస్తువులు తక్కువ ధరలకు దొరుకుతాయి. వెయ్యి రూపాయలకు దొరికే వస్తువు ఇక్కడ రూ,500 వందలకే దొరుకుతుంది. పాత వస్తువులతో పాటు కొత్త వస్తువులు సైతం ఇక్కడ అభ్యమౌతాయి. అయితే ఇక్కడ అభించే వస్తువులు ఎక్కువగా దొంగిలించిన వస్తువులనే ఒకప్పుడు అపవాదు ఉండేది. కాని నేడు అలాంటి పరిస్థితి లేదు. అనేక ప్రాంతాల నుంచి పాత, కొత్త వస్తువులను సేకరించి ఇక్కడి బజారులో అమ్ముతామే తప్ప మరొక్కటి కాదని వ్యాపారుల వాదన. వాస్తవం ఎలా ఉన్నా ఈ అంగడి నాలుగు దశాబ్దాల కాల క్రమంలో హైదరాబాద్‌కే తల మానికంగా మారింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement