Friday, November 22, 2024

ఆర్మీలో స్త్రీ, పురుషుల‌కు స‌మాన ఉద్యోగ‌వ‌కాశాలు..

రామచంద్రాపురం, (ప్రభన్యూస్‌) : భారత సైన్యంలో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు స్త్రీ, పురుషులకు సమాన ఉద్యోగ అవకాశాలు ఉంటాయని రచన జోషి పేర్కొన్నారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో గల తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ఆరో తరగతి నుండి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం వరకు విద్యార్థులకు ఆఫీసర్స్‌ కేడర్‌లో ఉద్యోగావకాశాల గురించి వింగ్‌ కమాండర్‌ జ్యోషి వివరించారు. ఇంటర్‌ తర్వాత ఎంపికైన విద్యార్థులకు శిక్షణ సమయంలో 80 వేల రూపాయల స్టైఫండ్‌ ఇవ్వబడుతుందని, శిక్షణ కాలం పూర్తయిన అనంతరం లక్షా 30 వేల రూపాయల వేతనం వస్తుందన్నారు.

మహిళలకు ఈ మధ్యనే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని, ఆర్ట్స్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ అన్ని కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థిని, విద్యార్థులకు ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. 18 నుంచి 26 సంవత్సరాలు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులు తమకు ఇష్టమైన బ్రాంచ్‌లో ఉద్యోగావకాశాలు పొందొచ్చని, భారతీయ వాయుసేనలో అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌, అకౌంట్స్‌, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, మెటీరియలాజికల్‌ ఉన్నత విద్యలో అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా రచన జ్యోషిని మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ రాంప్రసాద్‌ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాయుసేన వారెంట్‌ ఆఫీసర్‌దే, కార్పొరల్‌ దయానంద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement