Tuesday, November 19, 2024

పర్యావరణ పరిరక్షణ మనిషికి అదే రక్షణ – మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి .. ప్రభ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతి బాలాజీ డైరీ లో పర్యావరణ దినోత్సవం కార్యక్రమం జ‌రిగింది.ఈ కార్య‌క్ర‌మంలో ఇంఛార్జి మంత్రి ..ఉపముఖ్యంత్రి కే నారాయణస్వామి. ఇంధన, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీబీ మెంబర్ సెక్రెటరీ శ్రీ విజయ్ కుమార్, తదితరులు.

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ క్షీణిస్తున్న పర్యావరణానికి కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటితే అవి మనలను కాపాడుతాయని.. సీఎం జ‌గ‌న్ పర్యావరణాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నారని తెలిపారు.అనంత‌రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది ఒక తంతుగా కాకుండా, ప్రతి ఒక్కరూ పర్యావరణానికి తోడ్పడాలి ఇది అందరూ ఒక నియమంగా పెట్టుకోవాలి అని సూచించారు. ఇప్పుడు ప్రతి అంశంలో కాలుష్యం కనిపిస్తుంది, ఆ పరిస్థితి పోవాలంటే స్వయంగా మనం బాధ్యత తీసుకోవాలని చెవిరెడ్డి భాస్కరరెడ్డి లక్షల మొక్కలు పంపిణీ చేశారనీ, వాటిని మనం కాపాడుకుంటే పర్యావరణంకి మంచి చేస్తుందని అన్నారు. ఈ సమావేశానికి ముందుగా మంత్రులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ.ఈ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement