హైదరాబాద్, ఆంధ్రప్రభ : పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీఎస్ఐఐసీ అధికారులు, ఉద్యోగులకు చైర్మన్ బాలమల్లు, ఎండీ ఈవీఎన్రెడ్డిలు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలమల్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ప్రృకృతి ప్రసాదించిన అడవులను, నీటి వనరులను కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు ముప్పుతప్పదని హెచ్చరించారు., ఎండీ ఈవీఎన్రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూధన్, సీఈశ్యాంసుందర్, సీజీఎం సునీతాబాయి, జీఎంలు రేవతిబాయి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.