Thursday, November 21, 2024

సచివాలయ శిథిలాలు హుస్సేన్‌సాగర్‌లో..!!

తెలంగాణలో నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ మేరకు ఆ పనులను కూడా ప్రారంభించింది. అయితే పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్న ప్రభుత్వం ఆ శిథిలాలను చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో కలుపుతున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు పలువురు పర్యావరణ వేత్తలు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య వల్ల ఏడాదిలో హుస్సేన్‌సాగర్ 35 మీటర్ల మేర కుంచించుకుపోయిందని గూగుల్ ఎర్త్ చిత్రాల ఆధారంగా పర్యావరణ వేత్తలు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో చారిత్రకమైన హుస్సేన్‌సాగర్ సరస్సు పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామన్న పాలకులు విధ్వంసం దిశగా నడిపిస్తున్నారని వారు విమర్శలు చేశారు.

ఈ వార్త కూడా చదవండి: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండగ: మంత్రి కేటీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement