తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. హథ్ సే హథ్ పాదయాత్రలో భాగంగా నిన్న మేడారం వనదేవతల సన్నిధి నుంచి రేవంత్ ‘యాత్ర’ పేరిట ముందుకు సాగుతున్నారు. గతంలో వైఎస్సార్ ఏ విధంగా ప్రజలని ఆకట్టుకునేలా పాదయాత్ర చేశారో అదే తరహాలో రేవంత్ యాత్ర కొనసాగుతోంది.
వైఎస్సార్ సెంటిమెంట్ మాదిరిగానే మహిళా నేత, ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గమైన ములుగు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఇది దాదాపు రెండు నెలలపాటు కొనసాగనుంది. రెండో రోజులో భాగంగా మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండడంతో రేవంత్, సీతక్కతో పాటు చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు చెట్టునీడన సేదతీరే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, ప్రధానంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో రేవంత్రెడ్డి పాదయాత్ర ముందుకెళుతుందని తెలుస్తోంది. ఆ నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువ ఫోకస్ చేసి.. బలం మరింత పెంచాలని చూస్తున్నారు.