ప్రతివారం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై గట్టిపోటీ కనిపిస్తోంది. ఎవరికి వారు ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను అందించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. సాదాసీదా అంశాలతో రూపొందిన కంటెంట్ ను కాకుండా, కొత్త పాయింటును టచ్ చేసిన కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కాగా, ఓటీటీలో ఈ వారం 23 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇక వినూత్న కంటెంట్ కలిగిన జాబితాలో ‘క’ సినిమా, ‘వికటకవి’ .. ‘ పారాచూట్’ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన ‘క’ సినిమా, థియేటర్స్ వైపు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది. ఆయన ఇంతవరకూ చేసిన సినిమాలలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్, ఈ నెల 28వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా మరింత రెస్పాన్స్ ను రాబట్టుకునే ఛాన్స్ ఉంది.
ఇక నరేశ్ అగశ్య ప్రధానమైన పాత్రను పోషించిన ‘వికటకవి’ సిరీస్ పట్ల చాలామంది ఆసక్తిని చూపుతున్నారు. టైటిల్ తోను .. పోస్టర్స్ తోను అంచనాలు పెంచిన సిరీస్ ఇది. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా కనిపించే ఈ సిరీస్, ఈ నెల్ 28 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఫస్టు డిటెక్టివ్ సిరీస్ కావడమనేది ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక తమిళంలో రూపొందిన ‘పారాచూట్’ సిరీస్, ఈ నెల 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ నటుడు కృష్ణ కులశేఖరన్ ఈ సిరీస్ కి నిర్మాత. రాసు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తండ్రి కొడతాడనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరిగే కథ ఇది. తెలుగు ప్రేక్షకుల వరకూ తీసుకుంటే, ‘క’ సినిమాతో పాటు, ఈ రెండు సిరీస్ లు వారిలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నవే.
అమెజాన్ ప్రైమ్
- సేవింగ్ గ్రేస్ (తగలాగ్ సిరీస్) – నవంబర్ 28
- హార్డ్ నార్త్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29
నెట్ఫ్లిక్స్
- కోల్డ్ కేసు: హూ కిల్డ్ జాన్ బెనెట్ రామ్సే (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25
- ఆంటోని జెసెల్నిక్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 26
- చెఫ్స్ టేబుల్: వాల్యూమ్ 7 (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 27
- అవర్ లిటిల్ సీక్రెట్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 27
- ద మ్యాడ్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 28
- లవ్ నెవర్ లైస్: సౌతాఫ్రికా (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 29
- పారిస్ క్రిస్మస్ వాల్ట్జ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29
- సెన్నా (పోర్చుగీస్ సిరీస్) – నవంబర్ 29
- సికందర్ కా మఖద్దర్ (హిందీ సినిమా) – నవంబర్ 29
- ద స్నో సిస్టర్ (నార్వేజియన్ మూవీ) – నవంబర్ 29
- ద ట్రంక్ (కొరియన్ సిరీస్) – నవంబర్ 29
- లక్కీ భాస్కర్ (తెలుగు సినిమా) – నవంబర్ 30 (రూమర్ డేట్)
జీ5
- వికటకవి (తెలుగు సిరీస్) – నవంబర్ 28
- డివోర్స్ కే లియే కుచ్ బీ కరేగా (హిందీ సిరీస్) – నవంబర్ 29
హాట్స్టార్
- సునామీ: రేస్ ఎగైనస్ట్ టైమ్ (ఇంగ్లీష్ సిరీస్) – నవంబర్ 25
- పారాచూట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – నవంబర్ 29
సన్ నెక్స్ట్
- కృష్ణం ప్రణయ సఖి (కన్నడ సినిమా) – నవంబర్ 29
- జస్ట్ వన్ స్మాల్ ఫేవర్ (స్పానిష్ మూవీ) – నవంబర్ 29
- ద వైల్డ్ రోబో (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29
- వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – నవంబర్ 29
లయన్స్ గేట్ ప్లే
- బాయ్ కిల్స్ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – నవంబర్ 29