Thursday, January 9, 2025

Entertainment – ఆ రెండు మూవీల‌కు హైకోర్టు షాక్….

టికెట్ ధ‌ర‌ల‌ను 10 ప‌రిమితం చేస్తూ ఆదేశాలు..
కొత్త జివోను విడుద‌ల చేసేందుకు స‌మాయుత్తం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలతో పాటు 14 రోజుల పాటు టికెట్ ధరలని పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. టికెట్ ధరలు పెంచడం వలన సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సినిమాలకి భారీ కలెక్షన్స్ గ్యారెంటీ అని మేకర్స్ భావిస్తున్నారు.

అయితే టికెట్ ధ‌ర‌ల పెంపుపై దాఖ‌లైన పిటిష‌న్ ను నేడు విచారించిన ఎపి హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కేవ‌లం టికెట్ ధ‌ర‌లు పెంపు 10 రోజుల‌కే ప‌రిమితం చేయాల‌ని సూచించింది. దీంతో ప్రభుత్వం హై కోర్ట్ సూచనల మేరకు జీవోలో కొన్ని మార్పులు చేయనుంది. 14 రోజుల స్థానంలో కేవలం 10 రోజులకి మాత్రమే ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో సవరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement