Wednesday, November 20, 2024

ఇట‌లీలో ఇంగ్లీష్ మాట్లాడితే జ‌రిమానా వాత‌

రోమ్‌ (ఇటలీ): ప్రపంచ వ్యాప్తంగా రాజ్యమేలుతున్న భాష ఆంగ్లం. ఈ భాషకు వున్న క్రేజ్‌ గురించి అన్ని దేశాలకూ తెలుసు. చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో ఆంగ్లం తప్పనిసరిగా మారింది. అన్ని దేశాల్లో నూ మాతృభాషను పక్కకు తోసి రాజభాష అయిపోయింది ఆంగ్లం. ఇటువంటి పరిస్థితుల్లో ఆంగ్ల భాషను వినియోగించడానికి వీల్లేదంటూ హుకుం జారీచేసిం ది ఇటలీ ప్రభుత్వం. అందుకుగాను ఒక బిల్లును కూడా తీసుకువచ్చింది. మాట్లాడుతూ మధ్యలో పొరపాటున కూడా ఇంగ్లీషు పదాలు మాట్లాడినా పెద్ద మొత్తంలో ఫైన్‌ విధిస్తామని పేర్కొంది.


ఇటలీ ప్రధాని, బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేత అయిన జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం ఏ ఇటాలియన్‌ అయినా అధికారిక కమ్యూనికేషన్‌లో ఏదైనా విదేశీ భాషను, ప్రత్యేకించి ఆంగ్ల పదాలను వినియోగిస్తే గరిష్టంగా లక్ష యూరోలు (సుమారు రూ. 82 లక్షలు) వరకు జరిమానా విధిస్తారు. ఈ బిల్లును ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీ సభ్యుడు ఫాబియో రాంపెల్లి ప్రవేశపెట్టారు. దీనికి ప్రధాని జార్జియా మద్దతు తెలిపారు. ఇంగ్లీష్‌ పదాలు లేదా ఆంగోమానియాను టార్గెట్‌గా చేసుకుని ఈ చట్టాన్ని తీసుకువచ్చారని కొందరు భావిస్తున్నారు. ఈ బిల్లు ఇంగ్లీష్‌ భాష ఇటాలియన్‌ భాషను కించపరుస్తున్నట్లుగా వుందని పేర్కొంది. బ్రిటన్‌ నిష్క్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్‌ యూనియన్‌ కారణంగా ఈ పరిస్థితి మరింతగా దిగజారిందని ఆ బిల్లు పేర్కొంది. అయితే ఈ బిల్లు ఇంకా పార్లమెం ట్‌లో చర్చకు వెళ్లవలసి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement