టీ 20 ప్రపంచకప్ గెలిచి జోరు మీదున్న ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. దీని కోసం ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆదివారం తెల్లవారు జామున పాక్‌లో అడుగుపెట్టారు. గత 17 ఏళ్లలో ఇంగ్లండ్ క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్‌ల కోసం పాక్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంగ్లండ్ ఆటగాళ్లు చివరిసారిగా 2005లో పాక్‌లో పర్యటించారు. ఇక అప్పటి నుంచి భధ్రతా కారణాల దృష్ట్యా ఇంగ్లీష్ జట్టు పాక్ పర్యటనకు దూరంగా ఉంటూ వస్తున్నది. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఇంగ్లండ్, ప్రత్యామ్నాయ వేదికల్లో జరుగుతూనే ఉన్నాయి. కాగా గత నెలలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాడి తర్వాత ఈ టూర్‌పై సందేహాలు నెలకొన్నాయి.
2009లో పాకిస్థాన్‌లో పర్యటించిన శ్రీలంక జట్టుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో పాక్ పర్యటనకు అన్ని దేశాలు దూరంగా ఉంటూ వస్తున్నాయి. అయితే 2015 నుంచి అంతర్జాతీయ మ్యాచ్‌లకు పాక్ అడపాదడపా ఆతిథ్యం ఇస్తూనే ఉన్నది. ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది ఆరంభంలో పాక్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.