ఉప్పల్ టెస్ట్‌లో పర్యాటక జట్టు ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టాస్ ఓడిన భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ చేసే వాళ్లమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ పొడిగా కనిపిస్తోందని చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసిన తమ దగ్గర సరైన నైపుణ్యాలున్నాయని పేర్కొన్నాడు.
ఇంతకుముందు కూడా తాము ఇలాంటి పరిస్థితుల్లో ఆడామని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తమకు తెలుసని అన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. పేసర్లుగా బుమ్రా, సిరాజ్, స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్, అక్షర్ ఆడుతున్నారని తెలిపాడు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్