Saturday, November 23, 2024

ఇంగ్లండ్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ రెండో టెస్టు.. సెంచరీలు రికార్డు..

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌ బ్రిడ్జి స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు జో రూట్‌, ఆలీ పోప్‌లు సెంచరీలు నమోదు చేశారు. మాజీ కెప్టెన్‌ జో రూట్‌ వరుసగా రెండు టెస్టులో సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 2021 జనవరి నుంచి ఇప్పటి వరకు జోరూట్‌ 10 సెంచరీలు నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ డారిల్‌ మిచెల్‌ (190పరుగులు), టామ్‌ బ్లండెల్‌ (106పరుగులు) సెంచరీలతో రాణించడంతో 553పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ సైతం అంతే దీటుగా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ (67)తో శుభారంభాన్ని అందించగా, మరో ఓపెనర్‌ జాక్‌ క్రావ్లే (4) తీవ్ర నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన ఆలీ పోప్‌ (145) తన కెరీర్‌లో రెండో టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. అలీపోప్‌తో కలిసి రూట్‌ మూడో రోజు 187పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

అలాగే కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (46పరుగులు) కలిసి 61పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రూట్‌ 3వ రోజు ఆట ముగిసేసమయానికి 200బంతుల్లో 163 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 5వికెట్లు కోల్పోయి 473పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన తర్వాత కాసేపటికే రూట్‌ (176 పరుగులు 211 బంతుల్లో 26ఫోర్లు 1సిక్సర్‌) ఔటయ్యాడు. ఇక వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌ (56పరుగులు 104బంతుల్లో 10పరుగులు) రనౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌ టెయిలెండర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 539పరుగులకు ఆలౌటైంది. దీంతో న్యూజిలాండ్‌కు 14పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ టామ్‌ లథమ్‌ (4) వికెట్‌ను చేజార్చుకుంది. మరో ఓపెనర్‌ విల్‌ యంగ్‌ 36, డెవాన్‌ కాన్వే 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement