Wednesday, October 9, 2024

PAK vs ENG | ఇంగ్లండ్ బ్యాట‌ర్ల శ‌త‌కాల‌ మోత‌..

ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్నతొలి టెస్టులో ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రుగుల వ‌ర‌ద పారిస్తొంది. రెండో రోజున డ్రింక్స్ బ్రేక్ స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతూ 96/1 చేసింది. ఇక ఓవ‌ర్ నైట్ స్కోర్ తో మూడు రోజు ఆట‌ను ప్రారంభించిన ఇంగ్లండ్… డే ఎండ్ వ‌ర‌కు 493/3 ప‌రుగులు సాధించింది.

ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ జ‌ట్టు రెండు హాఫ్ సెంచ‌రీలు, రెండు సెంచ‌రీలు న‌మోదు చేసింది. ఓపెన‌ర్ జాక్ క్రాలే (78), బెన్ డ‌క్కెట్ (84) తో అర్థ శ‌త‌కాల‌తో రాణించారు. మ‌రోవైపు జో రూట్ (176 నాటౌట్), హ్యారీ బ్రూక్ (141 నాటౌట్) శ‌త‌క్కొట్టారు. దీంతో పాకిస్థాన్ నిర్ధేశించిన 556 ప‌రుగుల టార్గెట్ లో 64 ప‌రుగులు మాత్ర‌మే వెనుకంజ‌లో ఉంది. పాకిస్థాన్ బౌల‌ర్ల‌లో షాహీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా, అమీర్ జమాల్ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement