ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 466 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అయితే.. భారత్‌ను రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. రోహిత్ శర్మ 127 పరుగులు చేయగా.. శార్దూల్ 60 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రిషబ్ పంత్.. 50 పరుగులు చేసి ఔట్ అయ్యారు. పుజారా కూడా 61 పరుగులు చేసి భారత్‌కు పరుగులు అందించాడు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ రెండు హాఫ్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. ఉమేష్ యాదవ్ 25 పరుగులు చేసి.. పెవిలియన్ చేరాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో 466 పరుగులు చేసింది. అటు ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. కాగా భారత్ నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కోసం.. ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఒక ఓవర్ ముగియగానే.. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, పుజారాకు గాయాలయ్యాయి. దీంతో వాళ్లు ఫీల్డింగ్ నుంచి తప్పుకున్నారు.