Friday, November 22, 2024

ధావన్ సెంచరీ మిస్.. ఇంగ్లండ్ టార్గెట్ 318 రన్స్

పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ రెచ్చిపోయింది. 50 ఓవర్లలో 317/5 భారీ స్కోరు సాధించడంతో ఇంగ్లండ్ ముందు 318 పరుగుల టార్గెట్ నిలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఓపెనర్లుగా దిగిన రోహిత్ (28), ధావన్ (98, 106 బంతుల్లో 11×4, 2×6) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ముఖ్యంగా ధావన్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 11 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అయితే సెంచరీ చేస్తాడనుకున్న అభిమానులను ఓ చెత్త షాట్ ఆడి అతడు నిరాశపరిచాడు. అనంతరం కెప్టెన్ కోహ్లీ(56, 60 బంతుల్లో 6×4) కూడా రాణించాడు. అయ్యర్ (6), హార్డిక్ (1) తక్కువ స్కోర్లకు వెనుతిరిగారు. అయితే ఆడిన తొలి మ్యాచ్‌లోనే కృనాల్ పాండ్యా (58, 31 బంతుల్లో 7×4, 2×6) దూకుడుగా ఆడాడు. కేఎల్ రాహల్‌ (62, 43 బంతుల్లో 4×4, 4×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. దీంతో ఆరో వికెట్‌కు వీళ్లిద్దరూ కలిసి 112 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్‌కు మూడు వికెట్లు దక్కగా మార్క్ వుడ్‌కు రెండు వికెట్లు పడ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement