Tuesday, November 19, 2024

ఇంగ్లండ్‌ పేసర్‌ కాథరిన్‌ బ్రంట్‌.. టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై

ఇంగ్లండ్‌ పేసర్‌ కాథరిన్‌ బ్రంట్‌(36) టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేసింది. అయితే వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో ఆడతానని కాథరిన్‌ ప్రకటించింది.ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టులో కీలక బౌలర్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కాథరిన్‌ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. 2009లో వార్సెస్టర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కాథరిన్‌ బ్రంట్‌ 69 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

కాథరిన్‌ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడగా, 51 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ బౌలర్లలో మూడో స్థానంలో నిలిచింది. 2004లో ఉమెన్స్‌ ఆషెస్‌ టెస్ట్‌ టోర్నమెంట్‌లో కాథరిన్‌ టెస్టు మ్యాచ్‌ల్లోకి అడుగుపెట్టింది. ఉమెన్స్‌ గేమ్‌ చరిత్రలో ప్రధానంగా టెస్టుల్లో కాథరిన్‌ బ్రంట్‌ సుదీర్ఘ కెరీర్‌ కల్గి ఉంది. కాథరిన్‌ 140 వన్డేల్లో 167 వికెట్లు, 96 టీ20 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు తీసిన చరిత్ర ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement