Friday, November 1, 2024

ఇంగ్లండ్‌ క్రికెటర్ జిమ్ కన్నుమూత..

ఇంగ్లండ్‌ మాజీ వికెట్‌ కీపర్‌ జిమ్‌ పార్క్స్‌(90) బుధవారంనాడు కన్నుమూశారు. ఇంగ్లండ్‌ తరఫున అత్యంత వృద్ధ టెస్టు క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. జిమ్‌ పార్క్స్‌ అనారోగ్య కారణాలతో బాధపడుతూ గతవారం ఇంగ్లండ్‌లోని వార్తింగ్‌ ఆస్పత్రిలో చేరాడు. బుధవారం ఉదయం చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. జిమ్‌ పార్క్స్‌ 1954 నుంచి 1968 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ తరఫున 46 టెస్టుల్లో ప్రాతినిధ్యంవహించి రెండు వేలకు పైగా పరుగులు సాధించాడు.

ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. వికెట్‌ కీపర్‌ అయినప్పటికీ లోయర్‌ ఆర్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే జిమ్‌ పార్క్స్‌ తాను చేసిన రెండు సెంచరీలు 8వ స్థానంలో రావడం విశేషం. 1959/60 ఏడాదిలో పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 101నాటౌట్‌, అదే ఏడాది డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాపై 108 పరుగులు నాటౌట్‌తో జిమ్‌ పార్క్స్‌ గుర్తింపు పొందాడు. పార్క్స్‌ ససెక్స్‌, సోమర్‌సెట్‌ తరఫున 739 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు, 132 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement