టీమిండియాతో ఈనెల 25 నుంచి జరగనున్న మూడో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. భుజం గాయంతో ఆ టీమ్ పేస్ బౌలర్ మార్క్ వుడ్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. లార్డ్స్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో వుడ్ గాయపడ్డాడు. అయితే మూడో టెస్ట్ వరకూ అతడు కోలుకుంటాడని ఇంగ్లండ్ టీమ్ మేనేజ్మెంట్ భావించినా.. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు.
అయితే మార్క్ వుడ్ టీమ్‌తోనే ఉంటాడని, మెడికల్ టీమ్‌తో కలిసి కోలుకోవడంపై దృష్టిసారిస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. మూడో టెస్ట్ తర్వాత అతని ఫిట్నెస్ను మరోసారి అంచనా వేయనున్నారు. ఇప్పటికే బ్రాడ్, ఆర్చర్, వోక్స్, బెన్ స్టోక్స్ లాంటి వాళ్లను మిస్సయిన ఇంగ్లండ్‌కు.. ఇప్పుడు వుడ్ కూడా గాయపడటం కోలుకోలేని దెబ్బ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం