Thursday, November 21, 2024

విధి అంటే ఇదేనేమో.. ప్రియురాలి కోసం వెళ్లి ప్రియుడు బలి

గుంటూరు జిల్లా తాడేపల్లిలో విషాదం జరిగింది. ప్రియురాలి కోసం ఆమె హాస్టల్‌కు వెళ్లిన ప్రియుడు ప్రమాదవశాత్తూ చనిపోయిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఐదేళ్లుగా ఓ యువతి, యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే సదరు యువతి హాస్టల్‌లో ఉంటోంది. ఆదివారం రోజు హాస్టల్‌లో ఎవరికి తెలియకుండా బయటకు వెళ్లేందుకు ప్రేమజంట ప్లాన్ వేసింది. అయితే యువతిని హాస్టల్ గోడ ఎక్కిస్తుండగా వాచ్‌మెన్ చూసి కేకలు వేశాడు. ఈ క్రమంలో 5వ అంతస్తు నుంచి యువకుడు పారిపోయేందుకు పరుగెత్తుతుండగా కాలుజారి బిల్డింగ్ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయిన యువకుడు వినయ్ కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. యువతి కూడా అదే యూనివర్సిటీలో చదువుతోంది. కాగా ఈ వ్యవహారంపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement