Friday, November 22, 2024

తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్లు 80 వేలపైన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో త్వరలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్‌ సీట్ల వివరాలను విద్యాశాఖ ఖరారు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 137 కళాశాలల్లో 80,091 సీట్లు భర్తీ చేయనున్నారు. 16 యూనివర్సిటీ కాలేజీల్లో 4,713 సీట్లు ఉండగా, 2 ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 1,302 సీట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ ఏడాది కన్వీనర్‌ కోటాలో మాత్రం 62,079 సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అత్యధికంగా సీఎస్‌ఈలో 15,897 సీట్లు, ఈసీఈలో 9,734 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు 2023 జూన్‌ 28 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే ప్రతి ఏడాది ఇంజనీరింగ్‌ సీట్లు అన్ని బ్రాంచీలకు సంబంధించి నిండటం లేదు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement