హైదరాబాద్ ఆంధ్రప్రభ : అక్టోబర్ 25 నుంచి ఇంజనీరింగ్, వృత్తి విద్యా కోర్సుల మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అఖిల భారతీయ సాకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది. ఈమేరకు 2022-23 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. జులై 30 నాటికి కళాశాలలకు అనుమతుల ప్రక్రియ పూర్తి చేయనుంది. ఆగస్టు 31లోపు యూనివర్శిటీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కూడా పూరి చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 15 నాటికి ప్రస్తుత విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 25లోపు సీట్ల కేటాయింపు, రద్దు తదితర ప్రక్రియను పూర్తి చేయనుంది. ఆ తర్వాత అక్టోబర్ 25 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే నాలుగైదు రోజుల క్రితం ఏఐసీటీఈ వెబ్సైట్లో పెట్టిన షెడ్యూల్ను మార్చి ఈ తాజా షెడ్యూల్ను ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..