Saturday, June 29, 2024

ENG vs USA | బట్లర్ విధ్వంసం.. అమెరికాపై భారీ విజయం..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికాను 115 పరుగులకే పరిమితం చేసిన‌ ఇంగ్లండ్… అనంతరం చేజింగ్‌లో చెలరేగింది. ఆతిథ్య అమెరికాను చిత్తుగా ఓడించింది. స్వల్ప ఛేద‌న‌లో 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది.

116 పరుగుల స్వల్ప చేధనలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (38 బంతుల్లో 83 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. మరో ఎండ్ లో ఓపెనర్ ఎండ్ లో ఫిలిప్ సాల్ట్ (25 నాటౌట్) రాణించాడు. దీంతో ఇద్దరూ క‌లిసి 10 ఓవర్లలోపే మ్యాచ్‌ను ముగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement