ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో ఈరోజు జరిగిన రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక జట్టు తడబడింది. మూడో రోజు ఆటముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 182 పరుగలు చేసింది. అయితే, అంతకముందు తొలి ఇన్నింగ్స్ లోనూ శ్రీలంక 236 పరుగులకే కుప్పకూలింది. ధనుంజయ డిసిల్వా (74), మిలన్ రథానాయకె (72) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీశారు. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు.
ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ శ్రీలంకపై పట్టు బిగించింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో దంచి కొట్టింది. అయితే, నేటి మ్యాచ్ లో 358 పరుగుల భారీ స్కోరు వద్ద ఆలౌటయ్యింది. ఈ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ యువ వికెట్ బ్యాటర్ జేమీ స్మిత్ (111) సెంచరీ చెలరేగాడు. హ్యారీ బ్రూక్ (56) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో (4/103) నాలుగు వికెట్లు, ప్రభాత్ జయసూర్య (3/85) మూడు వికెట్లు తీశారు. విశ్వ ఫెర్నాండో (2/73) రెండు వికెట్లు తీశాడు. మిలన్‌కు ఒక వికెట్ దక్కింది.
దీంతో ఈరోజు 122 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక… మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులే చేసింది. ఏంజెలో మాథ్యూస్ (65) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కమిందు మెండిస్ (48 బ్యాటింగ్), మిలన్ రత్నాక్ (6 బ్యాటింగ్) ఉన్నారు.