టీ20 ప్రపంచ కప్‌లో బాగంగా నేడు జరుగుతున్న మరో మ్యాచ్‌లో గ్రూప్ బిలో ని ఇంగ్లండ్ – నమీబియా జట్లు తలపడుతున్నాయి. కాగా, వెస్ట్ ఇండీస్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. భారీ వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది.
కాగా, ఇంగ్లండ్, నమీబియా జట్లకు ఇదే చివరి గ్రూప్ దశలో మ్యాచ్. మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే 5 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే నమీబియా, ఇంగ్లండ్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఒకవేల వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చరో పాయింట్ ఇస్తారు. అలా జరిగినా.. ప్రస్తుతం ఐదు పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 8కి చేరుకుంటుంది.
అయితే ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న స్కాట్లాండ్ కు గ్రూప్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉంది. దీంతో ఇంగ్లండ్ జట్టు సూపర్ 8కి చేరుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి, స్కాట్లాండ్ తమ నెక్స్ మ్యాచ్‌లో ఓడిపోవాలని కోరుకువాలి. ఇక ఇప్పటికే గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా 6 పాయింట్లతో సూపర్ 8 కు చేరుకోగా.. ఓమన్ కనీసం ఖాతా కూడా తెరవకుండా అఫీషియల్‌గా ఎలిమినేట్ అయ్యింది.