Tuesday, November 26, 2024

తల వెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం..

తల వెంట్రుకల మాఫియాపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. నిన్న తెలుగు రాష్టాలలో 9 చోట్ల ఈడీ సోదాలు చేసింది. హైదరాబాద్‌లో 8 చోట్ల, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఒక చోట సోదాలు నిర్వహించి.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా దందా కొనసాగడంపై ఈడీ ఆరా తీస్తోంది. ఫెమా (ఫారన్ ఎక్సైంజ్ మేనేజ్‌మెంట్) తల వెంట్రుకలను ఇతర దేశాలకు కొనుగోలు చేస్తున్న ముఠాపై ఈడీ ఆరా తీస్తోంది. ఈ ముఠా దక్షిణాది రాష్టాల నుంచి ఎక్కువగా వెంట్రుకలను కొనుగోలు చేస్తోంది. వెంట్రుకలతో తయారవుతున్న విగ్గులకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.

మయన్మార్ నుంచి చైనాకు హైదరాబాద్ నుంచి కోల్‌‌కత్తాకు అక్కడి నుంచి ‌మణిపూర్‌లోని మోరే, మిజోరాం, మీదుగా చైనాకు ఎయిర్ కార్గో పార్సిల్ ద్వారా, రోడ్డు మార్గాల ద్వారా ఈ ముఠా తల వెంట్రుకలను తరలిస్తున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో అర్ధరాత్రి వరకు నరేష్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. నగరంలోని వికాస్ ఎంటర్ ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్, హృతిక్ ఎగ్జిమ్, న్యాలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్ డైరెక్టర్ ఇబ్రహీం పటేల్ కంపెనీలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఇది కూడా చదవండి: త్వరలోనే జిల్లాలకు కొత్త గులాబీ బాస్‌లు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement