Friday, November 22, 2024

న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

న‌ష్టాల‌తో ముగిశాయి స్టాక్ మార్కెట్లు. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు ఒకానొక దశలో 600 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. అయితే, ఆర్థికమాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో మార్కెట్లు చివర్లో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 53,134కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 15,810కి జారుకుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.54%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.92%), సన్ ఫార్మా (0.90%), రిలయన్స్ (0.80%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఐటీసీ (-1.73%), విప్రో (-1.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.20%), ఎల్ అండ్ టీ (-1.12%), మారుతి (-1.10%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement