Tuesday, November 26, 2024

వ్యవసాయంలో యాంత్రీక‌ర‌ణ‌కు ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

వ్య‌వ‌సాయంలో యాంత్రీక‌ర‌ణ‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని, దీనిపై రైతుల‌కు అవగాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని మంత్రి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న బేయర్‌ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నదని అన్నారు.

పత్తిసాగులో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకత పెంచడంతోపాటు పంటకోతలో ఉన్న సమస్యలను సరళీకరించేందుకుకు అమెరికాలో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణకు పత్తి, మొక్కజొన్న, కూరగాయల రకాల్లో నూతన వంగడాలను అందించేందుకు బేయర్‌ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. అమెరికాలో వ్యవసాయ కమతాలు పెద్దవికావడంతో వారు యాంత్రీకరణతో అద్భుతాలు సృష్టిస్తున్నారని తెలిపారు. తక్కువ విస్తీర్ణంలో తక్కువ రోజుల్లోనే అధిక ఉత్పత్తి సాధిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పత్తు సాగు, వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement