Tuesday, November 12, 2024

Encounter – రాజ్య‌స‌భ‌లో మోదీపై విరుచుకుప‌డ్డ ఖ‌ర్గే

ఎన్నిక‌ల ప్ర‌చారంలో అన్ని అబ‌ద్దాలే చెప్పారంటూ ఫైర్
కుల, మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టిన ప్ర‌ధాని
117 పిర్యాదులు చేసిన ప‌ట్టించుకోని ఈసి
ఎమ్మెల్యేల‌ను కొన‌డం, ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టుడే మీ ప‌ని
ఈడీ, సిబిఐ, ఐటిల‌తో విపక్షాల‌పై వేట
ఎన్నిక‌ల స‌మ‌యంలో బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్
పొత్తుల వ‌ద్ద‌నే మీరే ఇప్ప‌డు వాటికి కోసం వెంప‌ర్లాట‌
మీ పాల‌న‌లో అన్ని ప‌రీక్ష‌లు లీకేజ్ లే..
చందా దేవో..దందా ఖరో ఇదే మోదీ సిద్ధాంతం

- Advertisement -

.
ప్ర‌దాని మోదీ ఎన్నిక లప్రచారంలో అబద్ధాలు చెప్పారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నోటికొచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కుల,మత , భాషా పరంగా విద్వేషాలు రెచ్చగొట్టారన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మోదీ 200లకు పైగా స్పీచ్ లు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ117 కు పైగా స్పీచ్ లపై ఈసీకి కంప్లైంట్ చేశాం.. ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఖర్గే.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మాన చర్చ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, సామెతలు,సెటైర్లతో ప్రధానిపై కౌంటర్ అటాక్ చేశారు. ఎన్నికల ముందు విపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేసి.. ఎన్నికల ప్రచారాన్ని ఎన్నో రకాలుగా అడ్డుకోవాలని చూశారని విమర్శించారు. విపక్షాలను అణగదొక్కడం మోదీకి అలవాటుగా మారిందన్నారు. చందా దేవో..దందా ఖరో మోదీ నినాదంగా మారిందని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఐటీలను ఇష్టం వచ్చినట్లు వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వాలను పడొట్టడం, నేతలను కొనుగోలు చేయడం కామన్ అయిపోయిందన్నారు. మహారాష్ట్ర, గోవా,మణిపూర్ లో ప్రభుత్వాలను పడగొట్టలేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఘండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. కేజ్రీవాల్ కు ఒక కేసులో బెయిల్ వస్తే..మరో కేసులో అరెస్ట్ చేశారని అన్నారు.

పొత్తులను అపహస్యం చేసిన మోదీ..ఇపుడు పొత్తులపైనే ఆధారపడ్డారని అన్నారు. మోదీ సినిమాలో అన్ని లీకేజీలేనని సెటైర్ వేశారు. నీట్ పేపర్ లీక్, నీట్ నీట్ పీజీ రద్దు, అయోధ్య రామాలయంలో లీక్ ..ఏటా 20లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మూడేళ్ల కాలంలో 70 సార్లు పేపర్ లీక్ జరిగిందని మండిపడ్డారు ఖర్గే. అయితే ఖర్గే వ్యాఖ్యలను కేంద్రమంత్రి నడ్డా తప్పుబట్టారు. ప్రధాని మోదీపై, కేంద్రంపై ఖర్గే ఇష్టానుసారంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు నడ్డా. దీనిపై కూడా ఖ‌ర్గే మాట్లాడుతూ, తాను మాట్లాడింది త‌ప్ప‌ని నిరూపించ‌మంటూ న‌డ్డాకు స‌వాల్ విసిరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement