జమ్మూ కాశ్మీర్‌లోని అవంతి పొరాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా వాండక్ పోరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల్లో ఒకరిని కైజర్ కోకాగా గుర్తించారు. కాల్పుల్లో పాల్గొన్న మరో ఉగ్రవాది ఎవరనేది నిర్దారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాది నుంచి యుఎస్ ఆధారిత రైఫిల్ (ఎం-4 కార్బైన్), ఒక పిస్టోల్, ఇతర సామాగ్రితో సహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉగ్రవాదుల ఉనికి గూర్చి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ సంయుక్త బృందం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని ఒక అధికారి తెలిపారు. జాయింట్ టీమ్ అనుమానిత స్థలం వైపు సోదాలు ముమ్మరం చేయడంతో ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు సైన్యం ప్రతిదాడులు జరపడంతో ఇద్దరు మిలిటెంట్లు నేలకొరిగారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.