Tuesday, November 19, 2024

Encounter – జమ్ము కశ్మీర్‌లో ఎదురు కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హ‌తం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, జ‌మ్ముక‌శ్మీర్‌: జమ్ము కశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. కొంతకాలంగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జ‌రుగుతున్నాయి. తాజాగా శనివారం కూడా జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ జ‌రిగింది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. కోకర్నాగ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని హతమార్చాయి. ఇది కాకుండా, అనంతనాగ్‌లోని కచ్వాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్‌లోని ఖన్యార్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

శుక్రవారం యూపీకి చెందిన ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా ఆ ప్రాంతంలో కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భారత దళాలు.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement