గడ్చిరోలి జిల్లా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు, బద్రతాధలాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు నలుగురు నక్సలైట్లు హతమైనట్లు ప్రాథమిక సమాచారం. కాగా, ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ గాయపడగా, చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు.
భామ్రాగఢ్ తాలూకాలోని కోప్రి చివరి అటవీ ప్రాంతంలోని చెకుముకి రాయి గుట్టల్లో బద్రతాధలాలకు నక్సల్స్ ఎదుర్కోవడంతో, ఇరు వైపుల నుండి కాల్పులు ఆరంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నారని రహస్య సమాచారం అందటంతో 60 మందికి పైగా భద్రతా సిబ్బంది బృందాలుగా వెళ్లి నక్సల్స్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఇక్కడ కాల్పులు జరుగుతున్నాయని, మరింత సమాచారం అందాల్సి ఉంది.