Tuesday, November 26, 2024

Encounter – జమ్మూకశ్మీరులో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు ప్రారంభమైన నేపథ్యంలో వారి కోసం కేంద్ర సైనికల బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ముమ్మర గాలింపు చేపట్టాయి.

ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఫోర్సుకు చెందిన సైనికులు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సింధారా, పూంచ్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదుల ఏరివేత కోసం కేంద్ర బలగాలు డ్రోన్లను రంగంలోకి దింపాయి. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఉగ్రవాదులకు, కేంద్ర బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. హతమైన ఉగ్రవాదులు విదేశీయులని భావిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున కూడా భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న భారత సైన్యం ప్రత్యేక దళాలు, రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకాశ్మీర్ పోలీసు దళాలని పోలీసులు చెప్పారు. హతమైన ఉగ్రవాదులు విదేశీ ఉగ్రవాదులేనని, వారి వివరాలు పరిశీలిస్తున్నామని తెలిపిన భారత ఆర్మీ అధికారులు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement